సిద్దార్ధ్, శాంతి జంటగా మత్స్య క్రియేషన్స్ పతాకంపై కార్తీక్ విశ్వనాధ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరిగేలోగా ఈ క్షణం’. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొంది. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత కార్తీక్ విశ్వనాధ్ మాట్లాడుతూ... ‘నేను రాసుకొన్న కథపై నమ్మకంతో నా స్వీయ దర్శకత్వంలో ‘కరిగేలోగా ఈ క్షణం’ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. జూన్ 5 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. స్వచ్చమైన ప్రేమకు.. తల్లిదండ్రులు పిల్లలపై చూపే ఆప్యాయతకు అద్దం పట్టే విధంగా ఈ చిత్రం ఉంటుంది. చంద్రమోహన్, సుధ, చలపతిరావు వంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా కథ నచ్చి ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ‘బందూక్’ ఫేం కార్తీక్ కొడగండ్ల అందించిన బాణీలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జూలైలో చిత్రీకరణ పూర్తి చేసి, ఆగస్టు మొదటివారంలో ఆడియోను.. అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నాకు పూర్తి సహాయ సహకారాలందిస్తున్న మా టీమ్‌కి మరియు నా ఫ్యామిలీ మెంబర్స్‌కి నా కృతజ్ఞతలు’ అన్నారు.
సిద్దార్ధ్, శాంతి, కార్తీక్, చంద్రమోహన్, చలపతిరావు, సుధ, జబర్‌దస్త్ రాము తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: నాని, ఛాయాగ్రహణం: సంతోష్ కుమార్‌రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడగండ్ల, నిర్మాణం`దర్శకత్వం: కార్తీక్ విశ్వనాధ్!!