Advertisementt

నిఖిల్‌ సరసన నందిత..!!

Wed 03rd Jun 2015 05:53 AM
nanditha,nikhil,shankara bharanam,uday nandavanam  నిఖిల్‌ సరసన నందిత..!!
నిఖిల్‌ సరసన నందిత..!!
Advertisement
Ads by CJ

'నీకు నాకు డాష్‌ డాష్‌'తో తెలుగు తెరపై అరంగేట్రం చేసిన నందిత 'ప్రేమ కథ చిత్రమ్‌'తో తొలి కమర్షియల్‌ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎంచుకంటూ తన కెరియర్‌ను తెలుగులో బిల్డప్‌ చేసుకుంటోంది ఈ సొగసరి భామ. తాజాగా నందిత తెలుగులో మరో క్రేజీ అవకాశాన్ని సొంతం చేసుకుంది. నిఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'శంకరాభరణం'లో నందిత హీరోయిన్‌గా నటించనుంది.

ఉదయ్‌ నందనవనం దర్శకత్వం వహిస్తున్న 'శంకరాభరణం' సినిమాకు కోన వెంకట్‌ కథా రచన చేస్తున్నారు. గ్లామర్‌, అభినయం రెండూ ఉన్న హీరోయిన్‌ పాత్ర కోసం సినిమా యూనిట్‌ నందితను సెలక్ట్‌ చేసుకున్నట్లు తెలిసింది. బీహార్‌ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. అంజలి కీలకపాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎమ్‌వీవీ సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోపాటు 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' సినిమాలో కూడా నందిత హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ