Advertisementt

'స్విమ్మింగ్ పూల్' ఆడియో విడుదల..!

Wed 03rd Jun 2015 12:32 AM
swimming pool,audio launch,manohar chimmani,akhil karthik,arun kumar  'స్విమ్మింగ్ పూల్' ఆడియో విడుదల..!
'స్విమ్మింగ్ పూల్' ఆడియో విడుదల..!
Advertisement
Ads by CJ

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అఖిల్‌కార్తీక్‌, ప్రియ వశిష్ట జంటగా శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  మనోహర్‌ చిమ్మని దర్శకత్వంలో అరుణ్‌కుమార్‌ ముప్పన నిర్మించిన చిత్రం ‘స్విమ్మింగ్‌పూల్‌’. ఈసినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగింది. ప్రదీప్‌చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యింది. ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివ ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి ప్రతిమను హీరో మనోజ్‌నందంకు అందజేశారు. ఈ సందర్భంగా...

దర్శకుడు మనోహర్‌ చిమ్మని మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బాగుందంటూ అప్రిషియేట్ చేసారు. ఈ చిత్రంతో నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. ఈ రొమాంటిక్ హారర్ చిత్రం కోసం సిటీలో వివిధ లోకేషన్స్ తో పాటు, హైదరాబాద్ కు 55 కిలోమీటర్ల దూరంలో లో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో ఎక్కువ భాగం షూటింగ్ చేసాం. కథ డిమాండ్ ను బట్టి కొంత భాగాన్ని అమెరికాలో షూట్ చేసాం. సినిమాని 13రోజుల్లో పూర్తి చేశాం. ప్రదీప్‌చంద్ర మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. మంచి రీరికార్డింగ్‌ ఇచ్చారు. సినిమాని హారర్‌ ఎలిమెంట్స్‌తో, చక్కని కథతో తెరకెక్కించాం. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. అరుణ్‌కుమార్‌గారి సహాకారానికి నా ధన్యవాదాలు" అని అన్నారు. 

నిర్మాత అరుణ్‌కుమార్‌ ముప్పన మాట్లాడుతూ ‘‘ఇప్పుడు వస్తున్న రొటీన్ హారర్ చిత్రాలకు భిన్నమైన కథ, కథనాలతో ఒక ట్రెండీ రొమాంటిక్ హారర్ చిత్రంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఈ సినిమా తెలుగులో పర్యావరణ స్పృహతో తీసిన మొట్టమొదటి 'కార్బన్-న్యూట్రల్' చిత్రం కావడం విశేషం. ప్రదీప్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. అఖిల్‌ కార్తీక్‌, ప్రియ వశిష్ట  సహా ప్రతి ఒక ఆర్టిస్టు, టెక్నిషియన్‌ బాగా సపోర్ట్‌ చేశారు. సినిమాని జూన్‌ 12న విడుదల చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా పెద్ద సినిమా విడుదలైతే ఒక వారం ఆలస్యమవ్వచ్చు అంతే. సినిమా తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు. 

సంగీత దర్శకుడు ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ ‘‘మంచి మ్యూజిక్‌, రీరికార్డింగ్‌ కుదిరింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్‌’’ అని చెప్పారు. 

హీరో అఖిల్‌ కార్తీక్‌ మాట్లాడుతూ ‘‘దోస్త్‌ సినిమాతో ముప్పలనేని శివగారే నన్ను హీరోగా పరిచయం చేశారు. స్విమ్మింగ్‌పూల్‌ ఒక హార్రర్‌ ఎంటర్‌టైనర్‌. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్‌’’ అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో శివాజీరాజా, కాదంబరి కిరణ్‌, సురేష్‌కొండేటి సహా చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఆడియో, సినిమా పెద్ద హిట్‌ కావాలని యూనిట్‌ను అభినందించారు.

రుద్రాక్ష్‌, గౌతమ్‌, ఐశ్వర్య, బ్రాహ్మిణి, కె.జె.దశరథ్‌, రచ్చరవి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వీరేంద్రలలిత్‌, సాహిత్యం: తిరుపతి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ