Advertisementt

మంచు విష్ణు 'డైనమైట్' ఆడియో రిలీజ్ డేట్..!

Tue 02nd Jun 2015 11:35 PM
manchu vishnu,dynamite movie,release date,praneetha,acchu  మంచు విష్ణు 'డైనమైట్' ఆడియో రిలీజ్ డేట్..!
మంచు విష్ణు 'డైనమైట్' ఆడియో రిలీజ్ డేట్..!
Advertisement
Ads by CJ

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై  ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'డైన‌మైట్' సినిమా చేస్తున్నారు. విష్ణు పెర్ ఫార్మెన్స్, లుక్ కి సరిపొయే విధంగా ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు చెవి పోగు, చేతి పొడవునా టాటూతో డిఫరెంట్ లుక్ తో  కనువిందు చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.  ప్రస్తుతం సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంది. విష్ణు స‌ర‌స‌న గ్లామ‌ర‌స్ హీరోయిన్ ప్ర‌ణీత హీరోయిన్‌గా న‌టిస్తుంది. మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ అందించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్ర‌యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది.యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చు సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని జూన్ 6న సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ