Advertisementt

`శంక‌రాభ‌ర‌ణం`లో నందిత‌

Tue 02nd Jun 2015 03:11 AM
nanditha,naditha in shankarabharanam,nikhil,nanditha,shankarabharanam new movie,  `శంక‌రాభ‌ర‌ణం`లో నందిత‌
`శంక‌రాభ‌ర‌ణం`లో నందిత‌
Advertisement
Ads by CJ
నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌బోతున్న చిత్రం `శంక‌రాభ‌ర‌ణం`. ఉద‌య్ నంద‌న‌వ‌నం ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కోన వెంక‌ట్ ర‌చ‌న చేస్తున్నారు. ఓ క్రైమ్ కామెడీ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా నందిత‌ని ఎంపిక చేశారు. ఆ విష‌యాన్ని కోన వెంక‌ట్ ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో అంజ‌లి కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తుందని కోన తెలిపారు. ఈ నెల 15 నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌తారు. `గీతాంజ‌లి` త‌ర‌హాలో కోన ఒక మంచి టీమ్‌ని సెట్ చేసి ఈ చిత్రానికి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీహార్ నేప‌థ్యంలో  సాగే క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని  తెలుస్తోంది. నిఖిల్ `సూర్య వ‌ర్సెస్ సూర్య‌` త‌ర్వాత చేస్తున్న చిత్ర‌మిదే. మూడు వ‌రుస విజ‌యాల త‌ర్వాత చేస్తున్న ఈ చిత్రంపై నిఖిల్ కూడా భారీ అంచ‌నాల‌తో ఉన్నాడు. ఈ చిత్రం గురించి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కూడా ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తున్నాయి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ