Advertisementt

'పండగ చేస్కో' మూవీ సక్సెస్ మీట్..!

Tue 02nd Jun 2015 02:42 AM
pandaga chesko,success meet,gopichand malineni,ram  'పండగ చేస్కో' మూవీ సక్సెస్ మీట్..!
'పండగ చేస్కో' మూవీ సక్సెస్ మీట్..!
Advertisement
Ads by CJ

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి ప్రసాద్‌ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘పండగ చేస్కో’. మే 29న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా జూన్ 1న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.వి.వినాయక్ చిత్ర బృందానికి షీల్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ "ఈ సినిమా రిలీజ్ కు పది రోజుల ముందే నేను చూసాను. ఆరోజు నేను అనుకున్న విధంగానే ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రతి చోట సెకండ్ హాఫ్ బావుందని అందరు చెబుతున్నారు. రెడీ, కందిరీగ సినిమాల తరువాత రామ్ కెరీర్ లో మరొక బిగ్గెస్ట్ హిట్ 'పండగ చేస్కో'. పరుచూరి ప్రసాద్ సంవత్సరం పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించారు. కోనవెంకట్ ప్రేక్షకులను అలరించే విధంగా డైలాగ్స్ రాసాడు" అని అన్నారు. 

వి.వి.వినాయక్ మాట్లాడుతూ "ఈ సినిమా రివ్యూస్ కు, కలెక్షన్స్ కు సంబంధం లేదు. మంచి కలెక్షన్స్ తో సినిమా రన్ అవుతోంది. సినిమాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా పరుచూరి ప్రసాద్ గారు చాలా కష్టపడి సినిమా చేసారు. బలుపు తరువాత గోపి 'పండగ చేస్కో' సినిమాతో మరో హిట్ కొట్టాడు" అని చెప్పారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ "ఈ సినిమా హిట్ కావడానికి రెండు ప్రధానమైన కారణాలున్నాయి. అవి ఎంటర్ టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామా. సినిమాలో సెకండ్ హాఫ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. సినిమాను నిర్మించిన పరుచూరి ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. రామ్ నాకు బ్రదర్ లాంటి వాడు. తనకొక హిట్ సినిమా ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఓ మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రంతో ప్రూవ్ చేసారు" అని చెప్పారు.

రామ్ మాట్లాడుతూ "2013 లో ఈ సినిమా కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. అయితే ఈ మధ్య గ్యాప్ లో విడుదలయిన కొన్ని సినిమాల కాన్సెప్ట్ మా సినిమాకు దగ్గరగా ఉండడం వలన కాస్త రొటీన్ అనిపించవచ్చు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు చాలా ఎఫర్ట్ పెట్టి పని చేసారు. గోపీచంద్ మలినేనితో  వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, కోన వెంకట్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, సంపత్ రాజ్, ప్రియ, టాగూర్ మధు, డి.వి.వి.దానయ్య, స్రవంతి రవికిషోర్, పరుచూరి ప్రసాద్, పరుచూరి కిరీటి, వెలిగొండ శ్రీనివాస్, సమీర్ రెడ్డి, గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ