ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు... అంటూ మహేష్ చెప్పిన `పోకిరి` డైలాగ్‌ని ఇప్పటికీ ప్రేక్షకులెవ్వరూ మరిచిపోలేదు. ఆ డైలాగ్‌ని కొడుకు గౌతమ్ కృష్ణ చెబుతుంటే చూసి మురిసిపోయాడు మహేష్. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు ను పురస్కరించుకొని తన కొడుకు చెప్పిన డైలాగ్ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు మహేష్. డబ్ స్మాష్‌లో తన వాయిస్‌తో వచ్చిన డైలాగ్‌ని అనుకరిస్తూ గౌతమ్ కృష్ణ చేసిన ఫీట్ మహేష్‌కి బాగా నచ్చింది. అది ఇప్పుడు అభిమానుల్ని కూడా అలరిస్తోంది. గౌతమ్ తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ ఇంట్లో డైలాగులు వల్లెవేస్తున్నాడని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. గౌతమ్ రోజు రోజుకూ బాగా ఎదుగుతున్నాడు. `1`లో చూసిన గౌతమ్‌కీ, ఇప్పుడు గౌతమ్‌కీ చాలా వ్యత్యాసం ఉంది. చూస్తుంటే అతి త్వరలోనే తెరపై పూర్తిస్థాయిలో సందడి చేసేలా కనిపిస్తున్నాడు. అదే జరిగితే... సూపర్‌స్టార్ అభిమానులకు అంతకన్నా ఆనందం మరేముంటుంది! అన్నట్టు సూపర్‌స్టార్ కృష్ణకి తన తనయుడు మహేష్‌తో, మనవడు గౌతమ్‌తో కలిసి ఓ చిత్రంలో నటించాలనే కోరిక ఉంది. ఆ కోరికని గౌతమ్ త్వరలోనే నెరవేర్చేలా కనిపిస్తున్నాడు.