Advertisementt

‘బ్రహ్మోత్సవం’ ప్రారంభమైంది

Sun 31st May 2015 09:37 AM
super star mahesh,brahmotsavam movie opening,srikanth addala,pvp cinema   ‘బ్రహ్మోత్సవం’ ప్రారంభమైంది
‘బ్రహ్మోత్సవం’ ప్రారంభమైంది
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌  ‘బ్రహ్మోత్సవం’. సినీ జీవిత స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు మే 31. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రారంభోత్సవం పి.వి.పి. సంస్థ కార్యాలయంలో ఉదయం గం. 9.27ని॥లకు జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి నిర్మాతలు పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి క్లాప్‌, కెమెరా స్విచాన్‌ చేశారు. 

అదే  ‘బ్రహ్మోత్సవం’

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ ` ‘‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌తో మరో మంచి సినిమా చేస్తున్నాను. పివిపి సినిమా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ చెయ్యడం చాలా ఆనందంగా వుంది. ‘ఎక్కడైనా నలుగురు వున్న చోట  ఓ అందం, ఆనందం వుంటుంది. అలాంటిది అనేకమంది ఒక కుటుంబంలో వుండి ప్రతి ఓ సందర్భాన్ని ఓ ఉత్సవం జరుపుకునేటట్టు వుంటే అదే  ‘బ్రహ్మోత్సవం’’ అన్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 8 విడుదల

పి.వి.పి. అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ` ‘‘జూలై 10 నుంచి ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. మా పి.వి.పి. సంస్థలో ఇది ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తాం. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో జనవరి 8 నుంచే ఈ చిత్రం పండగ వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుంది. శ్రీకాంత్‌ అడ్డాల రెడీ చేసిన అద్భుతమైన స్క్రిప్ట్‌ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా నిర్మిస్తాం’’ అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, తనికెళ్ళ భరణిలతోపాటు భారీ తారాగణం ఇతర ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, ఎడిటింగ్‌: శ్రీకర ప్రసాద్‌, ఆర్ట్‌: తోట తరణి, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ