Advertisementt

జనవరి 8న మహేష్‌ ‘బ్రహ్మోత్సవం’.!

Sun 31st May 2015 06:40 AM
mahesh,srikanth addala,mahesh new movie brahmotsavam,brahmotsavam launch on 31st may,pvp cinema  జనవరి 8న మహేష్‌ ‘బ్రహ్మోత్సవం’.!
జనవరి 8న మహేష్‌ ‘బ్రహ్మోత్సవం’.!
Advertisement
Ads by CJ

ఈ సంవత్సరం సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజుకు ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగానే మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. అలాగే మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో పివిపి నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ కూడా ప్రారంభిస్తున్నారు. రేపు(31) ఉదయం 9.30 గంటలకు పి.వి.పి. సినిమా కార్యాలయంలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. జూలైలో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేస్తారట. జనవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని డేట్‌ కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి వున్న శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రాన్ని కూడా కుటుంబ వాతావరణంలో, విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే తియ్యాలని ప్లాన్‌ చేస్తున్నారట. శ్రీకాంత్‌ అడ్డాల చేసిన మూడు సినిమాలకు మంచి మ్యూజిక్‌ ఇచ్చిన మిక్కీ జె.మేయర్‌ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. సౌత్‌ ఇండియాలో టాప్‌ సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రహణాన్ని అందించబోతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ