‘అల్లూరి సీతారామరాజు’... ఈ సినిమా గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు వుండడు. నలభై సంవత్సరాల క్రితం ఈ చిత్రం సంచలనం సృష్టించింది. 1964 మే 1న తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రంగా విడుదలై ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించింది. కృష్ణ తన కెరీర్‌లో తనకు నచ్చిన చిత్రాల్లో మొదట చెప్పుకునేది ‘అల్లూరి సీతారామరాజు’ గురించే. అలాగే సూపర్‌స్టార్ మహేష్‌కి కూడా బాగా ఇష్టమైన సినిమా ఇదే. అప్పట్లో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా అందరి మనసుల్లో నిలిచిపోయిన ఈ చిత్రాన్ని ఈతరం ప్రేక్షకులు కూడా చూడాలని, సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆరోజుల్లోనే టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌లో నిర్మించిన ఈ చిత్రాన్ని ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఒక కొత్త లుక్ తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు సూపర్‌స్టార్ కృష్ణ. డిజిటల్ ఫార్మాట్ 4కెలో ఈ చిత్రానికి ఒక కొత్త రూపాన్ని తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డి.ఐ. వర్క్ జరుగుతోంది. అప్పట్లో మోనో సౌండ్‌తో రికార్డ్ చేసిన డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు మనం డిటిఎస్‌లో వినబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో మహేష్ బర్త్‌డేకి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.