Advertisementt

'రాజుగారింట్లో 7వ రోజు' ఏం జరిగింది..!

Sat 30th May 2015 03:00 AM
rajugarintlo 7va roju,firoj raja,bharath kumar peelam,ajay,sushmitha  'రాజుగారింట్లో 7వ రోజు' ఏం జరిగింది..!
'రాజుగారింట్లో 7వ రోజు' ఏం జరిగింది..!
Advertisement
Ads by CJ

అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుష్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం నిర్మిస్తున్న సినిమా 'రాజుగారింట్లో 7వ రోజు'. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు ఫిరోజ్ రాజ మాట్లాడుతూ "అందరి జీవితాలలో జరిగే సంఘటనలే ఈ కథ. రాజుగారింట్లో 7వ రోజు ఏం జరిగిందో  తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే" అని చెప్పారు.

నిర్మాత భరత్ మాట్లాడుతూ "ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఓ లీడ్ రోల్ లో నటిస్తున్నాను. హారర్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన చిత్రమిది. సినిమాకు ప్రతి ఒక్కరు ఎంతగానో సహకరించారు. అందరికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

అర్జున్ మాట్లాడుతూ "సినిమాలో నటించిన అందరం కొత్తవాళ్ళమే. అనుకున్న బడ్జెట్ లో సినిమా చేసాం. పాటలు అధ్బుతంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ గారు సినిమాలపై ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ కి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

వెంకటేష్ మాట్లాడుతూ "ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్ ప్లే చేసాను. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది. ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది" అని చెప్పారు.

సుస్మిత మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు" అని తెలిపారు.

రవి దొండపాటి మాట్లాడుతూ "ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాను. మంచి టెక్నీషియన్స్ కుదిరారు. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. కనిష్క్ మంచి మ్యూజిక్ అందించాడు" అని చెప్పారు.

ఈ చిత్రానికి నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన,దర్శకత్వం: ఫిరోజ్ రాజ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, ఎడిటర్: అనిల్, స్టిల్స్: నాగభూషణం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ