Advertisementt

జూన్‌ 4న ఆడియో, 12న సినిమా.!

Fri 29th May 2015 04:03 AM
telugu movie jyothi lakshmi,jyothi lakshmi on 12th june,puri jagannath,charmi  జూన్‌ 4న ఆడియో, 12న సినిమా.!
జూన్‌ 4న ఆడియో, 12న సినిమా.!
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు యాక్షన్‌ మూవీస్‌, యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌స్టోరీలు, తెలుగు స్క్రీన్‌పై చూడని డిఫరెంట్‌ క్యారెక్టర్లను పరిచయం చేసి డైరెక్టర్‌గా ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్న డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఎన్ని సూపర్‌ హిట్‌ సినిమాలు, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ చేసినా శాటిస్‌ఫై అవ్వని పూరి తనకి వున్న ఒకే ఒక కల ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా. ఎన్నో సంవత్సరాల పూరి కల ఇప్పటికి నెరవేరింది. ఛార్మిలాంటి వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌తో జ్యోతిలక్ష్మీ క్యారెక్టర్‌ చేయించి ఈమధ్యే ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ కూడా వదిలాడు. ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరికీ సినిమాలో ఏదో వుందనే ఆసక్తిని కలిగించడంలో పూరి సక్సెస్‌ అయ్యాడు. దాంతో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా చూడడం వల్ల గ్లామర్‌కి గ్లామర్‌, పూరి మార్క్‌ టేకింగ్‌, పూరి మార్క్‌ డైలాగ్స్‌ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోందట. సినిమాపరంగా పూరి జగన్నాథ్‌ శాటిస్‌ఫై అయ్యాడు, బిజినెస్‌పరంగా సి.కళ్యాణ్‌ కూడా ఫుల్‌ హ్యాపీగా వున్నట్టు తెలుస్తోంది. 

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్‌ 12న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అలాగే ఈ చిత్రం ఆడియోను జూన్‌ 4న విడుదల చేయబోతున్నారు. అయితే ఆడియోను మాత్రం రెగ్యులర్‌ ఫార్మాట్‌కి భిన్నంగా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లో రిలీజ్‌ చేస్తున్నారట. ఈ సినిమా సక్సెస్‌పై నిర్మాత సి.కళ్యాణ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అలాగే తమ కెరీర్‌లో ‘జ్యోతిలక్ష్మీ’ ఒక అద్భుతమైన సినిమా అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నారు పూరి జగన్నాథ్‌, ఛార్మి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ