కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నాడు. నటి విజయనిర్మల మనవడు, నరేష్ తనయుడైన నవీన్ విజయ్‌కృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతూ `ఐనా ఇష్టం నువ్వు` అనే చిత్రంలో నటిస్తున్నాడు. రామ్‌ప్రసాద్ రగుతు దర్శకత్వం వహిస్తున్నారు. చంటి అడ్డాల నిర్మాత. నవీన్ విజయ్‌కృష్ణ తన కుటుంబానికి చెందిన నటుడు కావడంతో తొలి నుంచీ ఈ సినిమాకి మహేష్ వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. తన సినిమా ఓపెనింగ్స్‌కి కూడా హాజరుకాని మహేష్ ఈ సినిమా ఓపెనింగ్‌కి హాజరై చిత్రబృందాన్ని సంతోషపెట్టాడు. ఇటీవల విడుదలైన టీజర్‌నీ, టైటిల్‌ని చూసిన మహేష్ మరోసారి ఆ చిత్రబృందాన్ని ప్రోత్సహిస్తూ... ``ఐనా ఇష్టం నువ్వు ఫస్ట్‌లుక్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇన్నొవేటివ్‌గా ఉంద``ని ట్విట్టర్‌లో అభినందించారు. ఈ సినిమా ఆడియో వేడుకకీ ఆయన హాజరు కావొచ్చని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.