సూపర్‌స్టార్ మహేష్ హీరోగా నటించే ప్రతి సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లేదా ట్రైలర్.. ఇలా ఏదో ఒకటి సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డేకి రిలీజ్ చెయ్యడం అనేది మొదటి నుంచీ సెంటిమెంట్‌గా వస్తోంది. అదే సెంటిమెంట్‌ని ఈ బర్త్‌డేకి కూడా కంటిన్యూ చేస్తున్నాడు మహేష్. మే 31 కృష్ణ బర్త్‌డే సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే, అదే రోజు మహేష్ కొత్త సినిమాని కూడా లాంచ్ చేస్తున్నారు. కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి క్లాస్ మూవీస్‌ని డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం కూడా మే 31న ప్రారంభం కాబోతోంది. ఈ రెండు కార్యక్రమాలు సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా జరగబోతున్నాయి. ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టినరోజు వేడుకల్ని పండగలా సెలబ్రేట్ చేసుకునే అభిమానులు ఈసారి మహేష్‌కి సంబంధించిన రెండు కార్యక్రమాలు కూడా అదేరోజు జరగనున్నందున వారంతా రెట్టించిన ఉత్సాహంతో వున్నారు. మే 31న జరిగే కార్యక్రమాల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల నుంచి అభిమానులు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి రానున్నారు.