అక్కినేని కుటుంబం నుంచి మరో వారసుడు కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయనే అఖిల్. వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. యువ కథానాయకుడు నితిన్ నిర్మిస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఆ చిత్రానికి `మిస్సైల్` అనే పేరు ప్రచారంలో ఉంది. అక్కినేని అభిమానులంతా `మిస్సైల్` పేరునే స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో నితిన్ రంగంలోకి దిగి పేరుపై క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదని ట్వీట్ చేశారు. ప్రచారంలో ఉన్న `మిస్సైల్` కరెక్టు కాదని చెప్పుకొచ్చారు. ఇటీవలే స్పెయిన్‌లో నెల రోజులపాటు చిత్రీకరణ జరిపారు. అక్కడ అఖిల్‌పై పాటలు, ఫైట్లు తెరకెక్కించారు. తదుపరి కెనడాలో మరో షెడ్యూల్ చిత్రీకరణ జరపబోతున్నారు. ఇందులో అఖిల్ సరసన సాయేషా సైగల్ నటిస్తోంది.