ఎన్టీఆర్, సుకుమార్ కలయికలో త్వరలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రకుల్‌ప్రీత్‌సింగ్ నాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నారు. గత కొంతకాలంగా షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతున్న ఈ చిత్రానికి నిర్మాత మారుతున్నాడని పుకార్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేయడంతో పాటు వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభించోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
అంతేకాదు ప్రస్తుతం ఎన్టీఆర్ గడ్డం పెంచుతుంది కూడా ఈ సినిమా కోసమేనని, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించబోయే ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ పేం విజయ్.కె.చక్రవరి ఛాయాగ్రహణం అందించబోతున్నాడని చిత్ర యూనిట్‌లోని ఓ చీఫ్ టెక్నిషియన్ తెలియజేశారు. మొదట్లో ఈ చిత్రానికి ఆర్య,జగడం,వన్, రోబో, లింగ చిత్రాల కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీ అందించబోతున్నాడని వార్తలు వినిపించాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రత్నవేలు ప్లేస్‌ను విజయ్.కె.చక్రవర్తి భర్తి చేయాల్సి వచ్చింది.