శ్రీశ్రీ మూవీ క్రియేషన్స్ పతాకంపై అరుణ్ కుమార్ ముప్పన నిర్మాతగా - నంది అవార్డు రచయిత,గతంలో 'కల' , 'అలా' , 'వెల్ కమ్' చిత్రాలు రూపొందించిన మనోహర్ చిమ్మని రచన, దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ హారర్ చిత్రం 'స్విమ్మింగ్ పూల్' సెన్సార్ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ "ఈ చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బాగుందంటూ అప్రిషియేట్ చేసారు. ఈ చిత్రంతో నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. ఈ రొమాంటిక్ హారర్ చిత్రం కోసం సిటీలో వివిధ లోకేషన్స్ తో పాటు, హైదరాబాద్ కు 55 కిలోమీటర్ల దూరంలో లో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో ఎక్కువ భాగం షూటింగ్ చేసాం. కథ డిమాండ్ ను బట్టి కొంత భాగాన్ని అమెరికాలో షూట్ చేసాం" అని అన్నారు.
నిర్మాత అరుణ్ కుమార్ మాట్లాడుతూ "ఇప్పుడు వస్తున్న రొటీన్ హారర్ చిత్రాలకు భిన్నమైన కథ, కథనాలతో ఒక ట్రెండీ రొమాంటిక్ హారర్ చిత్రంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఈ సినిమా తెలుగులో పర్యావరణ స్పృహతో తీసిన మొట్టమొదటి 'కార్బన్-న్యూట్రల్' చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం ప్రమోషన్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. జూన్ 1న ఈ చిత్రం ఆడియో రిలీజ్ కానుంది" అని చెప్పారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వీరేంద్ర లలిత్, ఎడిటింగ్: రాజేష్, మ్యూజిక్: ప్రదీప్ చంద్ర.