Advertisementt

నాని యాంక‌రింగ్‌..!

Mon 25th May 2015 03:35 AM
nani,babubali audio,nani anchoring for bahubali audio,prabhas,rajamouli,anushka,tamanna  నాని యాంక‌రింగ్‌..!
నాని యాంక‌రింగ్‌..!
Advertisement
Ads by CJ
యువ క‌థానాయ‌కుడు నాని యాంక‌ర్‌గా మార‌బోతున్నాడు. ఆశ్చ‌ర్యంగా ఉందా? యాంక‌రింగ్ నుంచి క‌థానాయ‌కులైన‌వాళ్ల‌ను చూశాం కానీ... క‌థానాయ‌కుడు యాంక‌ర్‌గా  మార‌డమేంటి అంటారా? అదే మ‌రి ఇక్క‌డ ట్విస్టు. నాని యాంక‌ర్‌గా మారుతుంది త‌న‌కు `ఈగ‌`లాంటి ఒక మంచి హిట్టిచ్చిన రాజ‌మౌళి కోసం. అవును... రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాహుబ‌లి` చిత్రానికి సంబంధించిన పాట‌లు ఈ నెల 31న హైద‌రాబాద్‌లో విడుద‌ల కాబోతున్నాయి. అదే వేడుక‌లో ట్ర‌యిల‌ర్‌ని కూడా విడుద‌ల చేస్తారు. గ్రాండ్ మేన‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఆ వేడుక‌కి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని రాజ‌మౌళి నానిని అడిగార‌ట‌. అంత‌కంటే భాగ్య‌మా  అన్న‌ట్టుగా నాని వెంట‌నే ఓకే చెప్పేశార‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. మా ఈగ యాంక‌రింగ్‌కి ఒప్పుకొన్నందుకు కృతజ్జ‌త‌లు అని చెప్పుకొచ్చాడు రాజ‌మౌళి. మంచి హాస్య‌చ‌తుర‌త ఉన్న నాని యాంక‌ర్‌గా వేడుక‌ని ర‌క్తి క‌ట్టిస్తాన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ