నాగాన్వేష్, కృతిక జంటగా సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మిస్తున్న సినిమా 'వినవయ్యా రామయ్యా'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మే 23న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బిగ్ సీడీని ఆవిష్కరించగా, ఆడియో సీడీలను ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆవిష్కరించి తొలి సి.డి.ని టాగూర్ మధుకి అందించారు. అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "ఈ చిత్ర నిర్మాత కృష్ణారెడ్డి కి, దర్శకుడు రామ్ ప్రసాద్ కు నా అభినందనలు. ఈ సినిమాతో కృష్ణారెడ్డి తన కొడుకును తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. సినిమా ట్రైలర్ బావుంది. నాగాన్వేష్ అధ్బుతంగా చేసాడు. తెలుగు ఇండస్ట్రీకి యంగ్ స్టర్స్ రావాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో హైదరాబాద్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కేంద్రబిందువు కానుంది. దానికి కావసిన అన్ని జాగ్రత్తలు తెలంగాణా ప్రభుత్వం తీసుకొంటుంది. ఈ మధ్య అన్ని సినిమాలకు అనూప్ రుబెన్సే సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ కూడా బావుంది. ఈ సినిమాతో టీమ్ అందరికి మంచి పేరు రావాలి. నాగాన్వేష్ తెలుగు ప్రజలందరికీ అభిమాన హీరో కావాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
రామచంద్రారెడ్డి మాట్లాడుతూ "సినిమా టైటిల్ బావుంది. సినిమాలో ఐదు పాటలు అధ్బుతంగా ఉన్నాయి. హీరోగా నాగాన్వేష్ కు మొదటి సినిమా. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
దర్శకుడు రాంప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమాకి అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రసూల్ ఎల్లోర్ విజువల్ గా సినిమాను అధ్బుతంగా చూపించారు. ఈ చిత్రంలో నాగాన్వేష్ ఓ సీనియర్ నటుడిలా నటించాడు. భవిష్యత్తులో పెద్ద నటునిగా తను ఎదగాలని, ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ "ఇదొక కుటుంబ కథా చిత్రం. సినిమాలో నాగాన్వేష్ చక్కగా నటించాడు. ఈ సంవత్సరంలో బెస్ట్ హిట్స్ లో ఒక చిత్రంగా 'వినవయ్యా రామయ్యా' నిలుస్తుంది. క్లైమాక్స్ అధ్బుతంగా ఉంటుంది. అనూప్ మంచి బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు" అని చెప్పారు.
నాగాన్వేష్ మాట్లాడుతూ "చిన్నప్పటి నుండి సినిమాలపై ఆసక్తితో సినిమారంగంలోకి వచ్చాను. చదువు పూర్తి కాగానే 2012 లో బొంబాయి వెళ్లి నటనలో శిక్షణ తీసుకొని 2013 లో తిరిగి వచ్చాను. ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. రాంప్రసాద్ ఎంతో మంది పెద్ద హీరోలతో సినిమాలు చేసారు. ఆయన సినిమాలో నేను నటించడం సంతోషంగా ఉంది. రసూల్ ఎల్లోర్ గారు చాలా సపోర్ట్ చేసారు. ఆయన చాలా జెన్యూన్ గా ఉంటారు. కృతిక ఈ సినిమాలో బాగా పెర్ఫార్మ్ చేసింది. అనూప్ పెర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సినిమా చేసారు. ఆయన అందించిన గోల గోల సాంగ్ నాకు చాలా నచ్చింది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.
కృతిక మాట్లాడుతూ "దృశ్యం సినిమాలో ప్రేక్షకులు నన్ను ఆదరించారు. మొదటిసారి హీరోయిన్ గా ఈ సినిమాతో పరిచయం కానున్నాను. హీరోయిన్ గా కూడా ఆడియన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను. తన కొడుకు డెబ్యు మూవీలో నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినందుకు నిర్మాత కృష్ణారెడ్డి గారికి నా ధన్యావాదాలు. సినిమాలో ప్రతి సాంగ్ నాకు నచ్చింది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు" అని చెప్పారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ "ఈ సినిమా చేయడానికి కారణం కృష్ణారెడ్డి గారు. నాగాన్వేష్ కు, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో నాకు గోల గోల సాంగ్ చాలా నచ్చింది. నాకు సహకరించిన లిరిసిస్ట్స్ కు, సింగెర్స్ కు నా ధన్యవాదాలు" అని చెప్పారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "15 సంవత్సరాలుగా నాకు కృష్ణారెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు. ఆయనకి సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. ఇప్పుడు వారి కుమారుడ్ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నారు. నాగాన్వేష్ డాన్సు చాలా బాగా చేస్తున్నాడు. రాంప్రసాద్ మంచి దర్శకుడు. సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది" అని అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రం నుండి సినిమాపై ఉన్న ప్యాషన్ తో ఈరోజు హీరో అయ్యాడు నాగాన్వేష్. సినిమాలో అధ్బుతంగా నటించాడు. ఎమోషన్ సీన్స్ లో, ఫైట్స్ సీన్స్ బాగా నటించాడు. రాంప్రసాద్ మాతో మంచి కామెడీ చేయించారు. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు" అని చెప్పారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ "ట్రైలర్ లో మంచి ఎనర్జీ ఉంది. కామెడీ టైమింగ్ బావుంది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా మంచి సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దిల్ రాజు, నల్లమలుపు బుజ్జి, జెమినీ కిరణ్, జీవితా రాజశేఖర్, రాజశేఖర్, గోపీచంద్ మలినేని, రేలంగి నరసింహారావుతదితరులు పాల్గొన్నారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, నరేష్, రామరాజు, సప్తగిరి, షకలక శంకర్, తులసి, రమాప్రభ, జయవాణి, ఉషాశ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్: రసూల్ ఎల్లోర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: ఎమ్.కిరణ్ కుమార్, మాటలు: వీరబాబు బాసిన, అనిల్ మల్లెల, నిర్మాత: 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి, దర్శకత్వం: జి.రామ్ ప్రసాద్