రామ్‌గోపాల్ వర్మ హీరోయిన్లు కేక పుట్టిస్తుంటారు. మనోడు రకరకాల యాంగిల్స్‌లో కెమెరాలు పెట్టి వాళ్ల అందాల్ని భలే ఇదిగా ఎలివేట్ చేస్తుంటాడు. అందుకే వర్మ సినిమాల్లో నటించేందుకు అమ్మాయిలు బాగా ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. ఆమధ్య `సత్య2`తో బాలీవుడ్ నుంచి అనైక సోఠిని తీసుకొచ్చాడు వర్మ. శర్వానంద్‌తో కలిసి ఆ సినిమాలో కనిపించింది అనైక. ఆమె అందం బాగా నచ్చిందేమో మరి... అందుకే `365డేస్`తో మరోసారి అవకాశమిచ్చాడు. ఈసారి అనైక మరింత అందంతో అదరగొట్టింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లవర్‌గా, ఫ్యామిలీ వుమెన్‌గా చాలా బాగా నటించేసింది. వర్మ `365డేస్` చూసిన దర్శకులంతా అనైకకి తమ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వాలనుకొనేంత అందంగా కనిపించింది. తడి అందాల్లో అనైక కనిపించిన విధానం కుర్రకారు బాగా నచ్చింది. అనైక కాళ్లు పైకెత్తించి, రోడ్డుపై ఆమెని పడుకోబెట్టి... చాలా సందడే చేయించాడు వర్మ. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు బాగా క్యాష్ చేసుకోవాలనుకొంటోందట అనైక.