Advertisementt

గౌతమ్ మీనన్ కొత్త తరహాలో తీసిన చిత్రం..!

Fri 22nd May 2015 10:13 AM
yenthavadu gani movie,ajith,trisha,anushka,a.m.ratnam  గౌతమ్ మీనన్ కొత్త తరహాలో తీసిన చిత్రం..!
గౌతమ్ మీనన్ కొత్త తరహాలో తీసిన చిత్రం..!
Advertisement
Ads by CJ

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అజిత్‌కుమార్‌ హీరోగా, గ్లామర్‌ బ్యూటీస్‌ త్రిష, అనుష్క హీరోయిన్స్‌గా శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై మెస్మరైజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఐశ్వర్య తమిళంలో నిర్మించిన చిత్రం ‘ఎన్నై అరిందాల్‌’. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవాడుకానీ’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు భారీ నిర్మాత ఎ.ఎమ్‌.రత్నం. ఈ చిత్రం ఈరోజు(మే 22) రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ "చాలా కాలం తరువాత థియేటర్ లో అభిమానుల మధ్య ఈ సినిమాను చూసాను. మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాను 250 థియేటర్లలో రిలీజ్ చేసాం. నైజాం, వైజాగ్ ప్రాంతాలలో దిల్ రాజు గారు విడుదల చేసారు. నైజాం, సీడెడ్, కృష్ణా అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా ముఖ్యంగా హిట్ అవడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మూవీలో తరువాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ, స్క్రీన్ ప్లే నే ప్రధాన కారణాలు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కొత్త తరహాలో తెరకెక్కించిన చిత్రమిది. లవ్, యాక్షన్ కలగలిపిన ఈ చిత్రం ఫ్యామిలీ తో చూడదగినది. కెమెరామెన్ లైట్స్ సహాయం లేకుండా న్యాచురల్ గా ఈ సినిమా తీసారు. అతి తక్కువ సమయంలో హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందరికి రీచ్ అయింది" అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ