Advertisementt

'కల్చర్' మూవీ ప్రారంభం..!

Fri 22nd May 2015 06:59 AM
culture movie,vijayanirmala,anand,ghantadi krishna  'కల్చర్' మూవీ ప్రారంభం..!
'కల్చర్' మూవీ ప్రారంభం..!
Advertisement
శ్రీ నటరాజ శ్రీనివాస్ క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.పి.ఆనంద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పి.శ్రీనివాసరావు నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'కల్చర్'. రవి కిషోర్, జనార్ధన్, అనిల్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల చేతుల మీదుగా శుక్రవారం ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం హీరోలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి విజయ నిర్మల గౌరవ దర్శకత్వం వహించారు. పి.శ్రీనివాసరావు,  ఘంటాడి కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 
నిర్మాత పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ "లేటెస్ట్ సబ్జెక్టుతో యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా 'కల్చర్'ను తెరకెక్కిస్తున్నాం. నిర్మాతగా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు. 
దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ "దర్శకుడిగా ఇది నా డెబ్యూ మూవీ. కాలేజీ యువత నేపధ్యంలో సినిమా ఉంటుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూళ్ళలో హైదరాబాద్లో షూటింగ్ కంప్లీట్ చేస్తాం" అని అన్నారు. 
సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ "ఇప్పుడున్న కల్చర్ మీద సెటైర్, మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంది" అని అన్నారు. కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.        
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement