‘జ్యోతిలక్ష్మి’తో మళ్లీ మునుపటి వేగం అందుకొన్నాడు పూరి. ఇక నుంచి అదే వేగంతో సినిమాలు తీయాలని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. చిరు సినిమాకి కథ ఓకే అయిన వెంటనే... మళ్లీ మహేష్‌కి కూడా కథ చెప్పి వార్తల్లోకెక్కాడు పూరి. చిరు సినిమాని కేవలం 70 రోజుల్లో పూర్తి చేసి ఆ తర్వాత మహేష్ సినిమా కోసం రంగంలోకి దిగాలని పూరి అనుకొంటున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఇంతలో మరో కొత్త న్యూస్ బయటికొచ్చింది. చిరు సినిమా మొదలయ్యేలోపు నితిన్‌తోనూ ఓ సినిమాని తీయబోతున్నాడట. చిరు సినిమా తర్వాత చేయాల్సిన సినిమాలు బోలెడన్ని ఉండటంతో ఆలోపే నితిన్‌తో సినిమాని పూర్తి చేయాలని పూరి ప్లాన్ చేసినట్టు సమాచారం. మరి చిరంజీవి ఒప్పుకొంటాడో లేదో చూడాలి. చిరు 150వ సినిమా అంటే ఆషామాషీ కాదు. అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ సిద్ధం చేయకుండా మరో సినిమా హడావుడిలో పడిపోతే ఎలాగని చిరు అడుగుతారేమో చూడాలి!