Advertisementt

‘టైగర్‌ సుల్తాన్‌’ సినిమా ప్రారంభం..!

Thu 21st May 2015 12:40 PM
tiger sulthan movie,toufeeq,anukruthi,sanjay panjabi  ‘టైగర్‌ సుల్తాన్‌’ సినిమా ప్రారంభం..!
‘టైగర్‌ సుల్తాన్‌’ సినిమా ప్రారంభం..!
Advertisement
Ads by CJ

‘ఏక్‌ థా సర్దార్‌’ అనే హైద్రాబాదీ ఫిలిం ద్వారా మంచి విజయాన్నందుకొని.. తాజాగా ‘టైగర్‌ సుల్తాన్‌’ చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకొనేందుకు సమాయత్తమవుతున్నారు తొఫీక్‌ ఖాన్‌. ఆయన కథానాయకుడిగా మినార్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా రూపొందనున్న చిత్రం ‘టైగర్‌ సుల్తాన్‌’. సంజయ్‌ పంజాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొఫీక్‌ ఖాన్‌ సరసన అనుకృతి హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం, అబిడ్స్‌లోని మెథడిస్ట్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్రాంగణంలో జరిగింది.

తెలంగాణ డిప్యూటి సి.యం మరియు రెవెన్యూ మినిస్టర్‌ అయిన మొహ్మద్‌ అలీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు`నిర్మాత తొఫీక్‌ ఖాన్‌, హీరోయిన్‌ అనుకృతి, జాహెద్‌ అలీఖాన్‌, అహ్మద్‌ జానీ, జయంత్‌, ఓంప్రకాష్‌ చౌనిక తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు-నిర్మాత తొఫీక్‌ ఖాన్‌ మాట్లాడుతూ... ‘‘ఏక్‌ థా సర్దార్‌’ తర్వాత కొంత విరామానంతరం నేను కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. అందరూ హైద్రాబాదీ నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఒక బడా డాన్‌ ఓ కాలేజ్‌ స్టూడెంట్‌ ప్రేమలో పడి, ఆమె ప్రేమను సొంతం చేసుకోవడం కోసం ఏం చేసాడు? అనేది చిత్ర ఇతివృత్తం. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. మా దర్శకుడు సంజయ్‌ పంజాబి కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటి సి.యం మొహ్మద్‌ అలిగారు మా సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి హైద్రాబాదీ ఫిలింస్‌కు కూడా సబ్సిడీ ఇప్పించవలసిందిగా కోరుకొంటున్నాం’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కూడా తెలంగాణ ప్రభుత్వం హైద్రాబాదీ సినిమాలకు సబ్బిడీ ఇచ్చి` సపోర్ట్‌ చేయాలని కోరారు.

భావన, మస్త్‌ అలి, ఇస్మాయిల్‌, అక్బర్‌ తబర్‌, అజీజ్‌ నాజర్‌, అల్తాఫ్‌ హైదర్‌, ఇక్బాల్‌ ఖాన్‌, అజీజ్‌ రిజ్వాన్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఖలీద్‌ హమీద్‌, సినిమాటోగ్రఫి: రాజశేఖర్‌, కథ: సల్మాన్‌ హైదర్‌, నిర్మాత: తొఫీక్‌ ఖాన్‌, దర్శకత్వం: సంజయ్‌ పంజాబి!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ