Advertisementt

'శీనుగాడి లవ్ స్టొరీ' పాటల విడుదల..!

Thu 21st May 2015 04:05 AM
seenugadi lovestory,audio release,srikanth,udhayanidhi,nayanathara  'శీనుగాడి లవ్ స్టొరీ' పాటల విడుదల..!
'శీనుగాడి లవ్ స్టొరీ' పాటల విడుదల..!
Advertisement
Ads by CJ

ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్‌, నయనతార హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘శీనుగాడి లవ్‌స్టోరీ’. ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌ దర్శకత్వంలో ‘ఇదు కదిర్‌వేలన్‌ కాదల్‌’ పేరుతో తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు ‘శీనుగాడి లవ్‌స్టోరీ’ పేరుతో అందిస్తున్నారు. హేరిస్‌ జయరాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. హీరో శ్రీకాంత్‌ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. సి.కళ్యాణ్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని హీరో శ్రీకాంత్‌కి అందజేశారు. ఈ సందర్భంగా...

హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘సాంగ్స్‌ అన్నీ బావున్నాయి. నాకు రామసత్యనారాయణ చాలా కావాల్సిన వ్యక్తి. తను ఏ సినిమా చేసినా మంచి ప్లానింగ్‌తోనే చేస్తాడు. ఈ సినిమా పెద్ద హిట్టయి రామసత్యనారాయణకి బాగా డబ్బులు వచ్చి త్వరలోనే తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘తమిళంలో ఈ చిత్రం సూపర్‌హిట్‌. ఈ చిత్రాన్ని తెలుగులో తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేయడం ఆనందంగా ఉంది. సాంగ్స్‌ బావున్నాయి. తమిళంలో కంటే తెలుగు ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’’ అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ఉదయనిధి స్టాలిన్‌కి తమిళంలో పెద్ద హిట్‌ చిత్రంగా నిలిచిన ఇదు కదిరివేలన్‌ కాదల్‌ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమాని జూన్‌ 5న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.  

ఈ కార్యక్రమంలో కె.వి.వి.సత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్‌, సత్యారెడ్డి, సోని, ఆంజనేయులు, ధనరాజ్‌, అంబికాకృష్ణ, ఆకాష్‌, వీరశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఉదయనిధి స్టాలిన్‌, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంతానం, శరణ్య, చాయాసింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణియం, ఎడిటింగ్‌: శివ వై.ప్రసాద్‌, సంగీతం:  హేరిస్‌ జయరాజ్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ