టాలీవుడ్‌లో యువ కథానాయకుల మధ్య మంచి వాతావరణం కనిపిస్తోంది. ఒకరికొకరు దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. కలిసిమెలసి నటించేందుకు కూడా ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇదివరకు ఇలా ఉండేది కాదు. నువ్వా నేనా అన్నట్టు పోటీ కనిపించేది. ఇప్పుడు ఆ ట్రెండ్‌ని మార్చేశారు. అందుకే మల్టీస్టారర్ చిత్రాలు విరివిగా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా ఆ స్ఫూర్తిని అంది పుచ్చుకొంటున్నారు. వాళ్లు కూడా కలిసిమెలసి నటిస్తున్నారు. తాజాగా యువ కథానాయకుడు సుధీర్‌బాబు చిత్రం `మోసగాళ్లకు మోసగాడు`లో మంచు మనోజ్ నటించాడు. ఓ అతిథి పాత్రలో మనోజ్ తళుక్కున మెరుస్తాడట. ఆ విషయాన్ని స్వయంగా సుధీర్‌బాబే వెల్లడించారు. మంచు మనోజ్ తెరపై ఎంతసేపు సందడి చేస్తారన్నది మాత్రం తెలియదు. ఇటీవల సుధీర్ కూడా మంచు లక్ష్మి నటించిన `దొంగాట`లోని ఓ పాటలో మెరిశాడు. అందుకు బదులుగా మనోజ్ నటించాడన్నమాట. `మోసగాళ్లకు మోసగాడు` ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.