టెంపర్‌తో సక్సెస్‌లో వున్న ఎన్టీఆర్, 1 నేనొక్కడినే చిత్రంతో కాస్త వెనకపడిన సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ లండన్‌లో జూన్ మొదటివారంలో స్టార్ట్ కాబోతోంది. స్పెయిన్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని మొదట లండన్‌లోనే మే 1న స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల జూన్ మొదటివారానికి పోస్ట్‌పోన్ అయింది. సుకుమార్ చిత్రాలన్నింటికీ సూపర్‌హిట్ పాటల్ని అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రం కోసం కూడా అద్భుతమైన సాంగ్స్‌ని సిద్ధం చేశాడట. ఇప్పటికే 5 పాటల ట్యూన్స్ రెడీ చేశాడు దేవి.
సాహసం, అత్తారింటికి దారేది చిత్రాలను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఆ చిత్రాల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రాన్ని కూడా రిలయన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. వరస హిట్ చిత్రాలతో మంచి ఊపు మీద వున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో జతకడుతుంది.
అత్తారింటికి దారేది చిత్రం తర్వాత తమ బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్ చిత్రమవుతుందని నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు.
ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కోప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.