Advertisementt

నిన్న తమిళ్‌లో ఓకే.. ఈరోజు కన్నడలో.!

Tue 19th May 2015 03:35 PM
nandamuri kalyan ram,telugu movie patas,patas movie in tamil,raghava lawrence,patas in kannada  నిన్న తమిళ్‌లో ఓకే.. ఈరోజు కన్నడలో.!
నిన్న తమిళ్‌లో ఓకే.. ఈరోజు కన్నడలో.!
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్‌రామ్‌కి చాలా గ్యాప్‌ తర్వాత ‘పటాస్‌’ రూపంలో ఒక బ్లాక్‌బస్టర్‌ హిట్‌ వచ్చింది. అనిల్‌ రావిపూడిని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బేనర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన ఈచిత్రం సాధించిన విజయానికి, వచ్చిన అప్రిషియేషన్‌కి టెమ్ట్‌ అయిన లారెన్స్‌ ఈ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్‌.బి.చౌదరి నిర్మాతగా ‘పటాస్‌’ రీమేక్‌ అవుతుండగా, ఇప్పుడు కన్నడలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు పోటీలు పడి రైట్స్‌ తీసుకున్నారట. కన్నడ చిత్రాలతోపాటు తెలుగులోనూ సినిమాలు నిర్మించిన ఎస్‌.వి.బాబు ‘పటాస్‌’ని కన్నడలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో గణేష్‌ హీరోగా నటిస్తుండగా, మంజు స్వరాజ్‌ డైరెక్ట్‌ చెయ్యబోతున్నాడు. తెలుగులో ఓ కొత్త తరహా చిత్రంగా, కళ్యాణ్‌రామ్‌ని కొత్త యాంగిల్‌లో చూపించిన ఈ చిత్రాన్ని తమిళ్‌లో లారెన్స్‌, కన్నడలో మంజు స్వరాజ్‌ ఏ రేంజ్‌లో హిట్‌ చేస్తారో చూద్దాం. 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ