Advertisementt

అవంతిక అందం అదిరింద‌హో..!

Tue 19th May 2015 12:20 AM
tamanna as avantika,bahubali,tamanna bhatia,rajamouli,babubali,rana,prabhas,  అవంతిక అందం అదిరింద‌హో..!
అవంతిక అందం అదిరింద‌హో..!
Advertisement
Ads by CJ
రాజ‌మౌళి ప్ర‌తీ పాత్ర‌నీ ఓ శిల్పంలా చెక్కుతాడు. అందుకే ఆయ‌న్ని అంతా జ‌క్క‌న్న అని పిలుస్తుంటారు. అలాంటి జ‌క్క‌న్న చేతిలో నిజంగా  ఓ  అంద‌మైన శిల్పంలాంటి క‌థానాయిక ప‌డితే? ఆ అందం మ‌రింత రెట్టింప‌వ‌దూ! `బాహుబ‌లి`లో త‌మ‌న్నా అవంతిక‌గా న‌టిస్తోంద‌న్న‌ప్ప‌ట్నుంచి అంద‌రి క‌ళ్లూ అటువైపే. మిల్కీ బ్యూటీ జ‌క్క‌న్న సినిమాలో ఎంత అందంగా క‌నిపిస్తుందో అంటూ క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆమ‌ధ్య త‌మ‌న్నా పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. అది చూడ‌గానే త‌మ్మూ అభిమానులంతా సూప‌ర్బ్ అనేశారు. ఇప్పుడు అవంతిక‌కి సంబంధించిన మ‌రో పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. అది మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. దీంతో కుర్ర‌కారంతా ఆ ఫొటోని మ‌ళ్లీ మ‌ళ్లీ చూసుకొంటున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ల‌లో షేర్ చేసుకొంటున్నారు. రాజ‌మౌళి ఓ పోస్ట‌ర్‌తోనే ప్రేక్ష‌కుల్ని ఇంత‌గా ఆక‌ట్టుకొంటున్నాడంటే ఇక సినిమాలో త‌మ‌న్నాని మ‌రెంత అందంగా చూపించారో అర్థం చేసుకోవ‌చ్చు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ