Advertisementt

'మోసగాళ్లకు మోసగాడు’ సెన్సారు పూర్తి!

Mon 18th May 2015 12:02 PM
  'మోసగాళ్లకు మోసగాడు’ సెన్సారు పూర్తి!
'మోసగాళ్లకు మోసగాడు’ సెన్సారు పూర్తి!
Advertisement
Ads by CJ

సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్ నేడు పూర్తయింది. యుబైఏ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 22న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తన తెలివితేటలతో ఎదుటి వారిని మోసం చేస్తూ సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు క్రిష్. ఎలాంటి గోల్ లేని అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యం వచ్చి చేరుతుంది. అదేమిటి? 12 శతాబ్దానికి చెందిన సీతారాముల విగ్రహాలతో అతనికి ఉన్న సంబంధమేమిటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదిని అలరిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘కథ,కథనాలు వినూత్న తరహాలో సాగుతాయి. మణికాంత్ ఖాద్రి అందించిన స్వరాలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రేమ, వినోదం, యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించి దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకముంది. సుధీర్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా చిత్రం నిలిచిపోతుంది’ అని అన్నారు. అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్,  పాటలు: శ్రీమణి, కె.కె, సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ