ఎప్పుడెప్పుడు బాక్సాఫీసు ముందుకొచ్చి సందడి చేద్దామా అని తహతహలాడుతున్నాడు రామ్. ఆయనకి హిట్టు పడి చాలా కాలమైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేసినా సరైన ఫలితం రావడం లేదు. ఈసారి మాత్రం హిట్టు కొట్టి తీరాలంతే అన్నట్టుగా కసితో పనిచేశాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `పండగ చేస్కో` అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాపై రామ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. కోన వెంకట్‌లాంటి ప్రముఖ రచయితల హస్తం దీని వెనక ఉండటం, గోపీచంద్ మలినేని `బలుపు`లాంటి హిట్టుతో జోరు మీద ఉండటంతో రామ్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అది ప్రచార చిత్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. చాలా కాలంగా సెట్స్‌పైనే ఉన్న `పండగ చేస్కో` ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకొంది. ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు రామ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇందులో రామ్ సరసన రకుల్, సోనాల్ నటించారు.