ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. దక్షిణాది నుంచివెళ్లిన ప్రభుదేవా ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ సినిమాలకే పరిమితమయ్యారు. దీంతో అటు తమిళ్.. ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా స్థానిక భాషల్లో ప్రభుదేవా సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్షకుల సంగతి పక్కనపెడితే త్వరలోనే తమిళ్ ప్రేక్షకులు ఓ కోలీవుడ్ సినిమాలో ప్రభుదేవాను చూసే అవకాశం ఉంది.
డైరెక్టర్ విజయం దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న ఓ హర్రర్ కామెడీ చిత్రంలో ప్రభుదేవా మెయిన్ రోల్‌లో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. వచ్చే ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో వరుస ప్లాఫులతో ప్రభుదేవా బాలీవుడ్‌లో కాస్త వెనుకబడ్డారు. అయినా ఆయనకు హీరోలనుంచి ఆఫర్లు మాత్రం వరుసకడుతున్నాయి. ప్రస్తుతం ఆయన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.