నందమూరి ఫ్యామిలీనుంచి మరో నటవారసుడి రాకకు రంగం సిద్ధమవుతోంది. బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞ త్వరలోనే వెండితెరకు పరిచయం కానున్నాడు. లయన్ సక్సెస్ మీట్ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన బాలకృష్ణ మోక్షాజ్ఞ ఎంట్రీపై స్పష్టతనిచ్చాడు.
2017లో మోక్షాజ్ఞ సినిమా ఉంటుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా కథ, డైరెక్టర్ విషయాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి వచ్చే ఏడాది కథ, డైరెక్టర్ తదితర అంశాలపై బాలకృష్ణ దృష్టిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందమూరి మూడో తరం నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ స్టేటస్‌ను పొందాడు. ఇక మోక్షాజ్ఞ తన తండ్రి నట వారసత్వాన్ని నిలబెడతాడో లేదో వేచిచూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ తన 99వ సినిమా 'డిక్టేటర్' పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా టైటిల్ డిక్టేటర్ అని చెబుతున్నప్పటికీ ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని బాలకృష్ణ