Advertisementt

వరసపెట్టి సినిమాలు చేయడానికి పూరి రెడీ.!

Sun 17th May 2015 08:16 AM
puri jagannath,chiru movie with puri,ramcharan with puri,charmi in jyothi lakshmi  వరసపెట్టి సినిమాలు చేయడానికి పూరి రెడీ.!
వరసపెట్టి సినిమాలు చేయడానికి పూరి రెడీ.!
Advertisement
Ads by CJ

ఆమధ్య చెప్పుకోదగ్గ హిట్స్‌ లేక అగమ్యగోచరంగా వున్న పూరి జగన్నాథ్‌ పరిస్థితి ఇప్పుడు చాలా బ్రైట్‌గా వుంది. ఈమధ్య ఎన్టీఆర్‌తో చేసిన ‘టెంపర్‌’ హిట్‌ అవ్వడంతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫామ్‌లోకి రావడం అంటే అలాంటి ఇలాంటి ఫామ్‌ కాదు.  లెక్కకు మించిన ఆఫర్స్‌తో సతమతమవుతున్నాడు. రోజుకో సినిమా కన్‌ఫర్మ్‌ చేసుకుంటున్నాడు. అయితే ఏ సినిమా ముందు స్టార్ట్‌ చెయ్యాలి, ఏది తర్వాత చెయ్యాలి అనేదానిపై కన్‌ఫ్యూజన్‌లో వున్నట్టు తెలుస్తోంది.

ఈమధ్య చిరంజీవి 150వ సినిమా పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చెయ్యబోతున్నట్టు, దానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు అఫీషియల్‌గా న్యూస్‌ వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్‌తో ఒక సినిమా కమిట్‌ అయి వున్నాడు. చిరంజీవి సినిమా కంప్లీట్‌ అయిన తర్వాత మహేష్‌ సినిమా స్టార్ట్‌ అయ్యే అవకాశాలు వున్నాయి. దీనికి సంబంధించిన కథా చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. 

ఈ రెండు సినిమాలు కాక రామ్‌చరణ్‌తో కూడా ఒక సినిమా చెయ్యడానికి పూరి ఓకే చెప్పాడట. మరో పక్క ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి.  అయితే చరణ్‌తో చెయ్యబోయే సినిమాకి సంబంధించి సబ్జెక్ట్‌ ఓకే అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పనిలో వున్నారు పూరి బృందం. ఇవి కాక నితిన్‌తో కూడా ఒక సినిమా చెయ్యాల్సి వుంది. అయితే ఆ సినిమా వుంటుందా లేదా అనేది డౌట్‌ అంటున్నారు. ఈ సినిమాలే కాకుండా కమిట్‌ అవ్వాల్సిన సినిమాలు కూడా వున్నాయని సమాచారం. ఈ లెక్కన పూరి కొన్ని సంవత్సరాల వరకు బిజీగానే వుంటాడన్నమాట. 

ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా ఛార్మితో చేస్తున్న ‘జ్యోతిలక్ష్మీ’ మీదే వుంది. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోయినప్పటికీ ప్రమోషన్‌ విషయంలో ఎక్కువ శ్రద్ద పెడుతున్నాడు పూరి. ఈరోజు(17) ఛార్మి పుట్టినరోజు సందర్భంగా ‘జ్యోతిలక్ష్మీ’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నారు. ఇదే వేదికపై ఛార్మి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కూడా జరుగుతాయి. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత పూరి ఊపిరి సలపనంత బిజీ అవనున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ