అజిత్ హీరోగా, అనుష్క, త్రిష హీరోయిన్లుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘ఎన్నయ్ అరిందాల్’ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవాడుగానీ..’ పేరుతో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మే 22న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతోంది. తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రం తెలుగులోనూ అదే రేంజ్‌లో హిట్ అవుతుందన్న నమ్మకంతోనే ఎ.ఎం.రత్నం తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఫిబ్రవరి 5న తమిళ్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ రావడంతో వెంటనే దానికి సీక్వెల్‌ని స్టార్ట్ చేస్తున్నారు. గతంలో అజిత్‌తో ‘వీరం’(తెలుగులో వీరుడొక్కడే) అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శౌర్యం డైరెక్టర్ శివ ప్రస్తుతం అజిత్‌తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అయిన తర్వాత ‘ఎన్నయ్ అరిందాల్’ సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రానికి కూడా నిర్మాత ఎ.ఎం.రత్నమే. ఆ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీమే సీక్వెల్‌కి కూడా వర్క్ చేస్తుందట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా వున్నాడు గౌతమ్ మీనన్. సీక్వెల్‌లో కూడా అనుష్క హీరోయిన్‌గా నటించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.
‘ఎన్నయ్ అరిందాల్’ తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయి అజిత్ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది. మరి తెలుగులో వస్తున్న ‘ఎంతవాడుగానీ’ చిత్రానికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో వెయిట్ అండ్ సీ.