శ్రీకాంత్, సోనియామాన్ జంటగా మహాలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న సినిమా 'డీ అంటే డీ'. మే 15న విడుదలయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చిత్ర దర్శక నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ "మే 15న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ప్రొడ్యూసర్ గా, దర్శకునిగా చాలా సంతోషంగా ఉన్నాను. అన్ని ఏరియాల నుండి సినిమా బావుందని కాల్స్ చేసి చెప్తున్నారు. సినిమాలో ఫైట్స్, సాంగ్స్, క్లైమక్స్ ఫైట్ హైలైట్స్ గా నిలిచాయి. సినిమా చూసిన వారంతా మంచి ఎంటర్ టైనింగ్ గా సాగుతుందని చెప్పారు. ఇంతటి విజయాన్ని అందించిన ఆడియన్స్ కు నా ధన్యవాదాలు" అని చెప్పారు.
భూపతిరాజా మాట్లాడుతూ "ఈ సినిమా ప్రేక్షకులకు సమ్మర్ ట్రీట్. మూవీలో హీరోకి, హీరోయిన్ కు మధ్య ఓ ప్రొఫెషనల్ క్లాష్ అవుతుంది. శ్రీకాంత్ గారికి, పిల్లలకి మధ్య జరిగే సన్నివేశాలతో సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది" అని చెప్పారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ "సినిమాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ చాలా సంతోషాన్నిచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక విజయవాడ వెళ్లాను. అక్కడ కూడా సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సాంగ్స్ కి, బ్రహ్మానందం గారి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో క్లైమాక్స్ ఫైట్ బావుందని అందరు చెప్పుకుంటున్నారు" అని చెప్పారు.
ఈ చిత్రానికి కథ: భూపతి రాజ, మాటలు: రాజేంద్ర కుమార్, సంగీతం: చక్రి , ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతం రాజు, కెమెరా: సి.హెచ్.గోపీనాథ్, ఫైట్స్: కనల్ కన్నన్, నిర్మాతలు: గరికిపాటి జ్యోతిక, సి.ఎస్.రెడ్డి, గ్రంధి సూర్య ప్రభాకర్, నిర్మాత - స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు.