బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన `లయన్` ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త తరహా కథతోనే తెరకెక్కినా సినిమాకి సరైన మౌత్‌పబ్లిసిటీ రాలేదు. పైగా సినిమా కాస్త లెంగ్తీగా ఉందనే నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చింది. దీంతో చిత్రబృందం నష్ట నివారణకి నడుం బిగించింది. సినిమాలో 14 నిమిషాల సన్నివేశాల్ని కత్తిరించేసి మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేశారు. దానికి తోడు కొత్త ట్రయిలర్లని కూడా విడుదల చేశారు. సినిమాకి ఎలాగైనా క్రేజీని తీసుకురావాలని చిత్రబృందం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం బాలకృష్ణనీ రంగంలోకి దింపారు. న్యూస్‌పేపర్లకీ, టీవీలకు బాలకృష్ణతో ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు. మరి చిత్రబృందం ప్రయత్నాలు సినిమాని నిలబెడతాయో లేదో చూడాలి. ఆదివారం వసూళ్లు సినిమా భవితవ్యాన్ని తేల్చే అవకాశాలున్నాయి.