‘కందిరీగ’ తర్వాత మూడు వరస ఫ్లాపులు ఇచ్చిన హీరో రామ్ ఇప్పుడు ‘పండగ చేస్కో’ చిత్రంతో పండగ చేసుకోబోతున్నాడట. డాన్ శీను, బాడీగార్డ్, బలుపు వంటి హిట్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘పండగ చేస్కో’ బాగా వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. థమన్ మ్యూజిక్‌తో ఇటీవల విడుదలైన ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో బిజినెస్ పరంగా ఈ సినిమాకి మంచి ఆఫర్సే వచ్చాయి. దీంతో అన్ని ఏరియాలను మంచి రేట్లకే క్లోజ్ చేసినట్టు సమాచారం. సింహా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన పరుచూరి శివరామ్‌ప్రసాద్‌కి ఈ సినిమా మరో పెద్ద హిట్ అవుతుందని సినిమాని చూసినవారు చెప్తున్నారు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకి మరో ప్లస్ అయిందని, రకుల్ వుంటే సినిమా హిట్టేనని ఈ సినిమాని కొన్న బయ్యర్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు మే 22న జరుగుతాయి. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని మే 29న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.