అల్లరి నరేష్, సాక్షి చౌదరి జంటగా ఏ.కె ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై సాయికిషోర్ మచ్చ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'జేమ్స్ బాండ్' నేను కాదు నా పెళ్ళాం అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన డైరెక్టర్ శ్రీనువైట్ల బిగ్ సీడీని ఆవిష్కరించి తొలి సిడిను హీరో శ్రీకాంత్ కు అందించారు. సాయికార్తిక్ సంగీతం అందించిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సదర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ "అనిల్ సుంకర మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి. నరేష్ చాలా హిట్స్ ఇచ్చి తనేంటో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. తన కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. సాయి కిషోర్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మంచి డైలాగ్స్ రాసాడు. సాయి కార్తిక్ సాంగ్స్ అన్ని చాలా క్వాలిటీ గా ఉన్నాయి. మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ "ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ బావున్నాయి. నరేష్ కు ఈ సినిమా పెళ్లి గిఫ్ట్ అవుతుందనే గట్టి నమ్మకం మాకుంది. సినిమా విజవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్" అని అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ "ఏ.కె.ఎంటర్ టైన్మెంట్స్ లో ఇది నా మూడవ సినిమా. మా బ్యానర్ ఇ.వి.వి లో చేయడంకంటే ఈ బ్యానర్ లో చేయడానికే ఇష్టపడతాను. ఎక్కడా కాంప్రమైస్ అవ్వని ప్రొడ్యూసర్స్. పక్కగా ప్లాన్ చేసి ఈ సినిమా తీసారు. ఈ సినిమాలో నాకంటే సాక్షి చౌదరి ఎక్కువ కష్టపడింది. రెండు ఫైట్స్ కూడా చేసింది. సాయి కిషోర్ గారు నవ్వుతు అందరితో కూల్ గా పని చేయించుకుంటారు. సాంగ్స్ లో కొంచెం కేర్ తీసుకోవాలని సాయి కార్తీక్ ను సెలెక్ట్ చేసుకున్నాం. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 5 సాంగ్స్ లో డెఫినెట్ గా 3 సాంగ్స్ హిట్ ఆల్బమ్ అవుతుంది" అని అన్నారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ "సినిమాలో సాక్షి తన రోల్ కు పర్ఫెక్ట్ గా సరిపోయింది. కథ చెప్పగానే నరేష్ ఓకే చేసారు. సాయి కిషోర్ 10 సంవత్సరాలుగా తెలుసు రెండు సార్లు అవకాశం ఇచ్చిన చేయలేదు. కిషోర్ లేకపోతే ఈ సినిమా చేయలేం. ఈ మూవీ కంప్లీట్ అయిందంటే ఆయన వలనే. శ్రీధర్ మంచి డైలాగ్స్ ఇచ్చాడు. సాయి కార్తీక్ భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. సినిమా ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేసారు" అని అన్నారు.
సాయి కిషోర్ మాట్లాడుతూ "ఈ అవకాసం ఇచ్చిన అనిల్ సుంకర గారికి, నరేష్ కు నా ధన్యవాదాలు. సాయి కార్తిక్ మంచి ఆడియో ఇచ్చారు. లిరిక్స్ కూడా బావున్నాయి. కెమరామెన్, ఎడిటర్, ఫైట్ మాస్టర్ అందరు చాలా సపోర్ట్ చేసారు. సాక్షి చౌదరి తన క్యారెక్టర్ యాప్ట్. సుదిగాడు సినిమా తరువాత ఎంతో మంది డైరెక్టర్స్ నరేష్ ను నటించమని అడిగిన నరేష్ నాకే అవకాశం ఇచ్చారు" అని చెప్పారు.
సాయి కార్తిక్ మాట్లాడుతూ "అనిల్ సుంకర గారితో గతంలో యాక్షన్ 3డి సినిమాకు వర్క్ చేసాను. ఇంత పెద్ద బ్యానర్ లో పని చేయడానికి అవకాసం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు. యాక్షన్ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది" అని అన్నారు.
సాక్షి చౌదరి మాట్లాడుతూ ""ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. యాక్షన్, లవ్, డ్రామా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. సాంగ్స్ చాలా బాగా కుదిరాయి" అని చెప్పారు.
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ "ఆడియో మంచి ఆల్బమ్ అవుతుంది. నేను రాసిన రెండు పాటలు కంటే విశ్వ రాసిన టైటిల్ సాంగ్ నాకు చాలా నచ్చింది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.
సుదీర్ బాబు మాట్లాడుతూ "ఇండస్ట్రీలో నాకు మంచి ఫ్రెండ్ నరేష్. వర్సటయిల్ యాక్టర్ తను. సినిమాలు హిట్స్, ఫ్లాప్స్ అయిన తన పార్ట్ మాత్రం మంచి మార్క్స్ తో పాస్ అవుతాడు. మంచి టీమ్ కలిసి చేసిన సినిమా ఇది" అని అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ "నాకు వెల్ విషర్ అనిల్ సుంకర గారు. టీమ్ అందరికి నా ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటింగ్: ఎమ్.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావుల, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి.