ఒకపక్క చిరు 150వ సినిమాకి సన్నాహాలు చేసుకొంటూనే మరోపక్క తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు పూరి. మహేష్‌బాబుతో `పోకిరి`, `బిజినెస్‌మేన్` చిత్రాల్ని తీసి హిట్టుకొట్టిన పూరి హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నాడు. ఆ మేరకు కథని సిద్ధం చేయడం, దాన్ని మహేష్‌కి వినిపించడం కూడా పూర్తయింది. నిన్ననే మహేష్‌ని కలిసి పూరి కథ చెప్పాడట. చిన్న లైన్ వినగానే మహేష్ ఇంప్రెస్ అయిపోయాడట. దీంతో పూరి ట్విట్టర్‌లో మహేష్ చిత్రం గురించి ప్రకటించారు. ``మహేష్ అభిమానులతో ఈ విషయం షేర్ చేసుకొంటున్నందుకు ఆనందంగా ఉంది. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. హ్యాట్రిక్‌కి సిద్ధంగా ఉండండి`` అంటూ ట్వీట్ చేశాడు పూరి.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా ముద్రపడ్డ మహేష్-పూరి కలయికలో మరో సినిమా తెరకెక్కుతుందని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడుతుండడంతో మహేష్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. పూరి ఈ చిత్రాన్ని చిరు 150వ సినిమా తర్వాత తెరకెక్కిస్తాడా లేక అంతకంటే ముందే పూర్తి చేస్తాడా అన్నది చూడాలి.