Advertisementt

‘మోసగాళ్లకు మోసగాడు’ విడుదల తేదీ మారింది!

Thu 14th May 2015 05:25 AM
mosagallaku mosagadu release date,sudheer babu,nandini,sudheer babu mosagallaku mosagadu  ‘మోసగాళ్లకు మోసగాడు’ విడుదల తేదీ మారింది!
‘మోసగాళ్లకు మోసగాడు’ విడుదల తేదీ మారింది!
Advertisement
Ads by CJ

సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ  చిత్రాన్ని మొదటగా ఈ నెల 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఒక రోజు ఆలస్యంగా  ఈ నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తన తెలివితేటలతో ఎదుటి వారిని మోసం చేస్తూ సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు క్రిష్. ఎలాంటి గోల్ లేని అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యం వచ్చి చేరుతుంది. అదేమిటి? 12 శతాబ్దానికి చెందిన సీతారాముల విగ్రహాలతో అతనికి ఉన్న సంబంధమేమిటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదిని అలరిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘కథ,కథనాలు వినూత్న తరహాలో సాగుతాయి. మణికాంత్ ఖాద్రి అందించిన స్వరాలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రేమ, వినోదం, యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించి దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు. అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్,  పాటలు: శ్రీమణి, కె.కె, సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ