అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో పివిపి సినిమా పతాకంపై ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘సైజ్ జీరో’. ఈ చిత్రం కోసం అనుష్క 20 కేజీల బరువు పెరుగుతున్న విషయం తెలిసిందే. రుద్రమదేవి, బాహుబలి చిత్రాల షూటింగ్స్ కంప్లీట్ అయిన వెంటనే బరువు పెరిగే పనిలో పడిరది అనుష్క. ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయి ప్రోగ్రెస్‌లో వుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే కింగ్ నాగార్జున ఇందులో ఒక అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ‘సూపర్’ చిత్రంతో అనుష్కను హీరోయిన్‌గా పరిచయం చేసింది నాగార్జునే. ఆ కృతజ్ఞతతోనే నాగార్జున పర్సనల్ మేకప్‌మేన్ బొమ్మదేవర రామచంద్రరావు నిర్మించిన ‘పంచాక్షరి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు అనుష్క కోసం నాగార్జున ‘సైజ్ జీరో’ చిత్రంలో ఓ అతిథి పాత్ర చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.