Advertisementt

ఒకేరోజు పోటీకి దిగుతున్న రెండు పులులు

Wed 13th May 2015 10:03 AM
vijay new movie puli,vishal new movie paayum puli,paayum puli and puli relesing on 17th sept  ఒకేరోజు పోటీకి దిగుతున్న రెండు పులులు
ఒకేరోజు పోటీకి దిగుతున్న రెండు పులులు
Advertisement
Ads by CJ

విజయ్‌ హీరోగా, శృతిహాసన్‌, హన్సిక హీరోయిన్లుగా శింబుదేవన్‌ దర్శకత్వంలో తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న భారీ చిత్రం ‘పులి’. ఈ చిత్రంలో ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌ శ్రీదేవి ఒక ముఖ్యపాత్ర పోషిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక సౌత్‌ ఇండియన్‌ మూవీలో శ్రీదేవి నటించడం విశేషం. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే విశాల్‌ హీరోగా, కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా సుశీంద్రన్‌ దర్శకత్వంలో ‘పాయుమ్‌ పులి’ పేరుతో మరో చిత్రం నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్రంలో విశాల్‌ ఒక అండర్‌ కవర్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఈ  రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్‌ కూడా కన్‌ఫర్మ్‌ అయ్యాయి. సెప్టెంబర్‌ 17న వినాయక చవితి కానుకగా ‘పులి’, ‘పాయుమ్‌ పులి’ రిలీజ్‌ అవబోతున్నాయి. హీరోగా తమిళ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీగా వున్న విజయ్‌కి, అంతగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ లేని విశాల్‌కి మధ్య సినిమాల పోటీ జరగబోతోంది. ఈ సినిమాల రిలీజ్‌ విషయంలో రెండు చిత్రాల నిర్మాతలు చాలా క్లారిటీతో వున్నారని సమాచారం. ఈ రెండు పులుల పోరాటం చాలా ఆసక్తికరంగా వుండబోతోందని తమిళ సినీవర్గాలు భావిస్తున్నాయి. ‘పులి’ అదే డేట్‌కి తెలుగులో కూడా రిలీజ్‌ అవుతోంది. విశాల్‌ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్‌ అవుతుంది. అలాగే ‘పాయుమ్‌ పులి’ చిత్రాన్ని కూడా తెలుగులో రిలీజ్‌ చెయ్యబోతున్నారట. మరి ఈ పోటీలో ఎవరు విన్‌ అవుతారో చూద్దాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ