Advertisementt

ఆ ఫంక్షన్‌కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథి

Wed 13th May 2015 09:58 AM
nara rohit,telugu movie asura,asura audio function,nandamuri balakrishna chief guest to asura audio,sai karthik,asura audio on 14th may  ఆ ఫంక్షన్‌కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథి
ఆ ఫంక్షన్‌కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథి
Advertisement
Ads by CJ

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో వంటి డిఫరెంట్‌ చిత్రాల హీరో నారా రోహిత్‌ హీరోగా దేవాస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కుషాల్‌ సినిమా, ఆరన్‌ మీడియా వర్క్స్‌ పతాకాలపై కృష్ణ విజయ్‌ దర్శకత్వంలో, శ్యామ్‌ దేవభక్తుని, కృష్ణ విజయ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అసుర’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మే 14న హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరగనుంది. ఈ ఆడియో ఫంక్షన్‌కి నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారట. ఈమధ్యకాలంలో నందమూరి హీరోల ఆడియో ఫంక్షన్లు, విజయోత్సవాలు ఎన్ని జరిగినా దేనికీ అటెండ్‌ అవ్వని బాలకృష్ణ ‘అసుర’ ఆడియో ఫంక్షన్‌కి హాజరవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన లెజెండ్‌ 400 రోజుల ఫంక్షన్‌కి ఎ.పి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు నారా రోహిత్‌ సినిమా ఆడియో ఆవిష్కరణకు నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరవడం విశేషమనే చెప్పుకోవాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ