Advertisementt

సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌..!!

Wed 13th May 2015 05:58 AM
surender reddy,ramcharan,next movie,my name is raju  సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌..!!
సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌..!!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఏచిత్రం చేయనున్నారనేది కొన్నాళ్లుగా సస్పెన్స్‌గా మారింది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు తెరవీడింది. తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించే అవకశాన్ని సురేందర్‌రెడ్డికి రామ్‌చరణ్‌ ఇచ్చినట్లు సమాచారం. రచయితలు కోన వెంకట్‌, గోపీ మోహన్‌లు తయారుచేసిన ఓ కథకు ఇదివరకే రామ్‌చరణ్‌ ఓకే చెప్పారు. అయితే ఈ కథకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేదానిపై కొన్నాళ్లుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్‌ను సురేందర్‌రెడ్డి దక్కించుకున్నట్లు సమాచారం.

రేసుగుర్రం సినిమాతో అల్లు అర్జున్‌కు కెరియర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌నిచ్చిన సురేందర్‌రెడ్డి ఇప్పుడు కిక్‌-2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన రామ్‌చరణ్‌ సినిమా పనులు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణస్‌ నటిస్తున్న 'మై నేమ్‌ ఈజ్‌ రాజు' షూటింగ్‌ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ రెండు సినిమాలు పూర్తవగానే రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డిల సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ