Advertisement
Banner Ads

'సినిమా చూపిస్త మావ' ఫస్ట్ లుక్ లాంచ్..!

Tue 12th May 2015 03:44 AM
cinema chupistha mava,raj tarun,avika gor,trinatharao,bekkam venugopal  'సినిమా చూపిస్త మావ' ఫస్ట్ లుక్ లాంచ్..!
'సినిమా చూపిస్త మావ' ఫస్ట్ లుక్ లాంచ్..!
Advertisement
Banner Ads

రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సినిమా చూపిస్త మావ'. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ "గోపి నేను కలిసి చాలా రోజుల నుండి ఓ సినిమా చేయాలనుకున్నాం. అనుకున్నట్లుగానే సినిమా మొదలుపెట్టాం. 'మేము వయసుకు వచ్చాం' సినిమా తరువాత మా కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఈ సినిమా స్టార్ట్ చేసాం. డిస్ట్రిబ్యూటర్స్ అందరికి లాబాలు తెచ్చిపెడుతుంది. అందరు చాలా కష్టపడి ఈ సినిమా చేసారు. ఉయ్యాలా జంపాల సినిమాతో రాజ్ తరుణ్, అవికా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించాలనే ఉద్దేశ్యంతో ఆ జంటనే ఈ సినిమాకు ఎన్నుకున్నాం" అని చెప్పారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ "ఈ సినిమాకు శేఖర్ మంచి మ్యూజిక్ అందించాడు. నా తోటి నిర్మాతలు ఎంతగానో సహకరించారు. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేసారు. ఈ సినిమా సహాయపడిన అందరికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

రూపేష్ మాట్లాడుతూ "ఇది నా మూడవ సినిమా. ఈ సినిమాతో మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. 

శేఖర్ చంద్ర మాట్లాడుతూ "మేము వయసుకు వచ్చాం సినిమా తరువాత త్రినాధ్ గారు ఈ సినిమాతో మరో అవకాశం ఇచ్చారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలి" అని చెప్పారు.

ప్రసన్న జె. కుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా మొదలు పెట్టి 14 నెలలు అయింది. తెలుగు ఇండస్ట్రీ వారు ప్రేమ కథలు సరిగ్గా తీయలేరని అందరు అనుకుంటారు. కాని గత 10 సంవత్సరాలలో ఔట్ అండ్ ఔట్ లవ్ స్టొరీ తీసారు త్రినాధ్ గారు. మరొక అధ్బుతమైన లవ్ స్టొరీ ని ఈ సినిమాతో ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఆయన కోసమే ఈ సినిమాకి మాటలు రాయడానికి అంగీకరించాను" అని చెప్పారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ "ఉయ్యాల జంపాల సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాను. ప్రసన్న, డైరెక్టర్ స్టొరీ చెప్పగానే కథ నచ్చి ఒప్పుకున్నాను. ఇదొక మంచి మాస్ ఎలిమెంట్స్ తో కూడిన లవ్ స్టొరీ. ఫైట్స్ ఏమి ఉండవు. సినిమా బాగా వచ్చింది. రావు రమేష్ గారు అధ్బుతంగా నటించారు. ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. త్రినాధ్ గారు కూల్  పర్సన్. ప్రొడ్యూసర్స్ అందరు బాగా ప్రోత్సహించారు" అని అన్నారు.

అవికా గోర్ మాట్లాడుతూ "రాజ్ తరుణ్ తో నేను మరోసారి చేస్తున్న ఈ సినిమా అందరికి నచ్చుతుందనుకుంటున్నాను. టీజర్ చూస్తే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుంది" అని చెప్పారు.

ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు, ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం, మ్యూజిక్: శేఖర్ చంద్ర, ప్రొడ్యూసర్స్: బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.

Advertisement
Banner Ads

Loading..
Loading..
Loading..
Advertisement
Banner Ads