వరుస సినిమాలు ఒప్పుకొంటూనే .. కాస్త వైవిధ్యమైన చిత్రాలు చేస్తోన్న యువహీరో నారారోహిత్ తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రం కథ నారారోహిత్‌కు బాగా నచ్చిందట. ఈ చిత్రానికి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నారారోహిత్‌తో పాటు శ్రీవిష్ణు మరో హీరోగా చేస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వశిష్ఠ మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. హరి, సన్నిరాజులు ఈ చిత్ర నిర్మాతలు.
జూన్ మొదటి వారం నుండి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. 1992-1996సంవత్సరాల మద్య ఇద్దరు యువకుల జీవితాల్లో చోటు చేసుకున్న కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంలో రాయల్‌రాజుగా నటించి మెప్పించిన శ్రీవిష్ణు ఇందులో సెకండ్ హీరోగా నటిస్తున్నాడు.