Advertisementt

'సింగం123' మూవీ ఆడియో లాంచ్..!

Sun 10th May 2015 03:17 PM
sampoornesh babu,sonam,manchu vishnu,akshath vijay sharma  'సింగం123' మూవీ ఆడియో లాంచ్..!
'సింగం123' మూవీ ఆడియో లాంచ్..!
Advertisement

సంపూర్నేష్ బాబు, సనమ్ జంటగా డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన సినిమా 'సింగం123'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. మంచు విష్ణు బిగ్ సిడి ను ఆవిష్కరించారు. శేషు కె.ఎమ్.ఆర్. సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో జంగ్లీ మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ "2003లో మంచి సినిమాలు నిర్మించాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యానర్ స్థాపించాను. మొదట్లో నా దగ్గరకి వచ్చిన స్క్రిప్ట్స్ తృప్తి పరచకపోవడంతో టివి సీరియల్స్, ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఒక టాక్ షో చేయాలని చాలా టివి చానెల్స్ ను సంప్రదించాను. మా టివి వారు కూడా రిజెక్ట్ చేసారు. ఆ సమయంలో జీ తెలుగు వారు మమ్మల్ని ప్రోత్సహించి కొన్ని ఎపిసోడ్స్ వేసారు. అదే లక్ష్మి మంచు చేసిన ప్రేమతో మీ లక్ష్మి టాక్ షో. ఆ షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2007 'కృష్ణార్జున' సినిమాతో ప్రొడక్షన్ మొదలుపెట్టాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సంపు నటించిన 'హృదయకాలేయం' సినిమా చూసి ఆయను ఆఫీస్ కు పిలిపించి సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. సినిమా టైటిల్ 'సింగం123' అనుకున్నాం. రామ్ గోపాల్ వర్మ గారికి ఫోన్ చేసి టైటిల్ చెప్పగానే బావుందని చెప్పారు. ఓ పేరడి సినిమా చేయాలని స్టొరీ రెడీ చేసుకున్నాను. డైమండ్ రత్నం మంచి ఇన్ పుట్స్ ఇచ్చారు. అక్షత్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఈ సినిమాను ఆయనతో డైరెక్ట్ చేయించాలనుకున్నాను. శేషు మంచి మ్యూజిక్ అందించాడు. ఇదొక స్పూఫ్, సెటైరికల్ కామెడీ సినిమా. ఎవరిని కించపరచడానికి ఈ సినిమా చేయలేదు. సంపు ఈ సినిమా చేస్తే స్మూత్ గా ఉంటుందని ఆయన హీరోగా సినిమా నిర్మించాం. ఫ్యామిలీ ఆడియన్స్ కు ముఖ్యంగా పిల్లలకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మొదట ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నాం. కాని గ్రాఫిక్స్ లేట్ అవ్వడం వలన ఈ నెల 28 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా హిట్ అయితే ఇదే బ్యానర్ లో నాలుగైదు తక్కువ బడ్జెట్ చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాను " అని చెప్పారు.   

డైరెక్టర్ అక్షత్ అజయ్ శర్మ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి నా ధన్యవాదాలు. సినిమా స్టొరీ, డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాతో సంపు అందరిని నవ్విస్తాడు. ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ అందరికి నా స్పెషల్ థాంక్స్" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ శేషు మాట్లాడుతూ "5 నెలల ముందు విష్ణు గారు నాకు స్టొరీ చెప్పి మ్యూజిక్ చేయమని చెప్పారు. నన్ను నమ్మి ఇంత మంచి ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు విష్ణుగారికి నా థాంక్స్. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేసి చేసాను. సినిమా అందరికి నచ్చుతుంది" అని చెప్పారు.

డైమండ్ రత్నం మాట్లాడుతూ "పాండవులు పాండవులు తుమ్మెద సినిమా నా కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచింది. అధ్బుతమైన సినిమాతో అధ్బుతమైన ఫ్యామిలీ పరిచయమయ్యింది. ఈ సినిమాతో మరో అవకాశం వచ్చింది. సంపు చాలా కష్టపడే వ్యక్తిత్వం గలవాడు" అని చెప్పారు.

సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ "పరోక్షంగా నాకు ఎంతో హెల్ప్ అయిన వ్యక్తి మోహన్ బాబు గారు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. అలాంటిది ఆయన కొడుకు నిర్మిస్తున్న సినిమాలో హీరోగా చేయడం చాలా సంతోషంగా ఉంది. పెద్ద హీరోతో చేయించినట్లు ఈ సినిమాలో నాతో ఫైట్స్ చేయించారు" అని చెప్పారు.

ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-ప్రొడ్యూసర్: మంచు విష్ణు, డైరెక్టర్: అక్షత్ విజయ్ శర్మ, డైలాగ్స్: డైమండ్ రత్నం, సినిమాటోగ్రాఫర్: సతీష్ ముత్యాల, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్: శేషు. కె.ఎమ్.ఆర్, ఫైట్స్: పి.సతీష్, ఆర్ట్: రఘు కులకర్ణి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement