దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు బి.ఎ. సమర్పణలో ఎస్.ఎల్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపైన ముళ్ళపూడి వరా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వాన... ఎమ్. ఎమ్. కీరవాణి సంగీత దర్శకత్వంలో యువ నిర్మాతలు జి. అనిల్‌కుమార్ రాజు, జి. వంశీకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కుందనపు బొమ్మ’. ఒక్క పాట మినహా చిత్రం పూర్తయింది. మిగిలి ఉన్న ఈ డ్యూయెట్ సాంగ్‌ని పాలకొల్లు, ఆ సమీప ప్రాంతాలలో చిత్రీకరించారు. దీనితో చిత్ర నిర్మాణం మొత్తం పూర్తయింది.
చిత్ర నిర్మాతలలో ఒకరైన జి. అనిల్‌కుమార్ రాజు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘‘పల్లెటూరి ప్రేమకథా చిత్రమిది. దీనిని విజయనగరం, బొబ్బిలి మొదలగు ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. మిగిలిఉన్న ఒక్క డ్యూయెట్ సాంగ్‌ని పాలకొల్లులోనూ, ఆ సమీప ప్రాంతాలైన యలమంచలి లంక, శంకరగుప్తం మున్నగు ప్రాంతాల్లోని సుందరమైన లోకేషన్స్‌లో చాందినీ చౌదరి`సుధీర్‌లపైన చిత్రీకరించడం జరిగింది. కృష్ణారెడ్డి ఈ పాటకి నృత్య దర్శకత్వం వహించారు. ఈ పాటతో మొత్తం చిత్ర నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్‌లో డిటిఎస్ వర్క్ జరుగుతుంది.’’ అని చెబుతూ
మే 3 వ వారంలో ఆడియో విడుదల
‘‘సంగీత దర్శకులు ఎమ్. ఎమ్. కీరవాణి గారు ‘కుందనపు బొమ్మ’కు చాలా మంచి పాటలను ఇచ్చారు. ఈ చిత్రం ఆడియోను మే మాసం ద్వితీయార్ధం విడుదల చేస్తాము. మా దర్శకులు ముళ్ళపూడి వరా, స్వచ్ఛమైన తెలుగుదనం ఉట్టిపడే కథలో ‘కుందనపు బొమ్మ’ను వెండితెరకు ఎక్కించారు. యువత మెచ్చే రీతిలో ఈ తరం ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఈ కథలో ఉంటాయి. అలాగే అన్ని తరగతుల ప్రేక్షకుల్ని..ముఖ్యంగా మహిళా లోకాన్ని ఈ చిత్రం మెప్పిస్తుంది..’’ అని చెప్పారు.
ఈ చిత్రంలో సుధాకర్ కోమాకుల, సుధీర్‌వర్మ, చాందినీ చౌదరి, రాజీవ్ కనకాల, నాగినీడు, చంద్రశేఖర్, షకలక శంకర్, ఝాన్సీ, మధుమణి, గాయత్రి భార్గవి, ఆలపాటి లక్ష్మీ, అజయ్ ఘోష్, షాని, సిరి, పల్లవి, మాస్టర్ సాత్విక్, బేబీ జాహ్నవి మున్నగువారు నటించిన తారాగణం.
ఈ చిత్రానికి మాటలు: అనురాధ ఉమర్జి-గౌతమ్ కశ్యప్, కథావిస్తరణ-స్క్రీన్‌ప్లే: కె.కె. వంశీ-శివ తాళ్ళూరి, సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.డి. జాన్, ఆర్ట్ డైరెక్టర్: ఎమ్. కిరణ్‌కుమార్, కో`డైరెక్టర్: ఎమ్.ఎస్, కొరియోగ్రఫీ: కృష్ణారెడ్డి మున్నగువారు పనిచేసిన సాంకేతిక నిపుణులు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లాది సత్య శ్రీనివాస్, కో`ప్రొడ్యూసర్స్: నడిరపల్లి నరసరాజు, జి. అనితాదేవి,
నిర్మాతలు: జి. అనిల్‌కుమార్ రాజు, జి. వంశీకృష్ణ
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ముళ్ళపూడి వరా.