Advertisementt

రవితేజ కెరీర్‌లో ఇది రికార్డే మరి.!

Sat 09th May 2015 03:26 AM
raviteja new movie kick2,kick2 audio on 9th may,surender reddy,ntr arts,kalyan ram,ss thaman  రవితేజ కెరీర్‌లో ఇది రికార్డే మరి.!
రవితేజ కెరీర్‌లో ఇది రికార్డే మరి.!
Advertisement
Ads by CJ

రవితేజ లేటెస్ట్‌ మూవీ ‘కిక్‌2’. అప్పట్లో రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్‌’ ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. ఆ చిత్రం ద్వారా థమన్‌ని తెలుగులో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్‌ చేశాడు రవితేజ. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌ 50 సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ‘కిక్‌2’ చిత్రానికి కూడా థమన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ రేపు(9) హైటెక్స్‌లో జరగబోతోంది. దీనికి సంబంధించిన విశేషమేమిటంటే ఈ ఆడియో రైట్స్‌ని టైమ్స్‌ మ్యూజిక్‌ సంస్థ 55 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది రవితేజ కెరీర్‌లోనే ఓ రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రవితేజకు సంబంధించి ఎంత పెద్ద హిట్‌ అయిన ఆడియోకి కూడా ఇంత పెద్ద ఎమౌంట్‌ రాలేదు. అలాగే ఈమధ్యకాలంలో టాప్‌ స్టార్స్‌  సినిమాల ఆడియోలకు కూడా ఈ రేటు పలకలేదు. సాధారణంగా మహేష్‌ సినిమాల ఆడియో రైట్స్‌ హై రేంజ్‌లో వుంటాయి. అంటే 60 లక్షల వరకు వుంటుంది. ఆడియో రైట్స్‌ పరంగా రవితేజ మహేష్‌ తర్వాతి స్థానంలోకి వెళ్ళాడంటే అది రికార్డే కదా. ‘కిక్‌’ని మించే రేంజ్‌లో ‘కిక్‌2’ ఆడియో వుంటుందని థమన్‌ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. ‘కిక్‌’ చిత్రంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమైన తను ‘కిక్‌2’ చిత్రానికి కూడా మ్యూజిక్‌ చేయడం హ్యాపీగా వుందంటున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ